హనుమకొండ, 2026-06-05
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక సిద్ధాంతకర్తగా నిలిచిన ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఆయన చిత్రపటానికి గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జయశంకర్ సేవలు చిరస్మరణీయం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం ఎప్పటికీ చిరస్మరణీయమని గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ అన్నారు. మన పరకాల నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించిన జయశంకర్, తెలంగాణ సమాజానికి చూపిన దిశానిర్దేశం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా అనేక ప్రసంగాలు చేశారని మహమ్మద్ అజీజ్ ఖాన్ గుర్తుచేశారు. తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జానా (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని ఆయన తరచుగా అనేవారని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ కార్యదర్శి సరిత, గ్రేడ్1 గ్రంథ పాలకులు మాల్సుర్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.నిఖిల్, గ్రేడ్ 2 గ్రంథ పాలకులు మల్లికార్జున్, ఉద్యోగులు మమత, రాజేష్ తో పాటు గ్రంథపాఠకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆచార్య జయశంకర్ సార్కు ఘనంగా నివాళులర్పించారు.