రాజన్న సిరిసిల్ల, శనివారం
జిల్లా పర్యటన నిమిత్తం సిరిసిల్ల విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి, పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్ తుకారాంజీకి జిల్లా అధికారులు, న్యాయమూర్తులు ఘన స్వాగతం పలికారు. పంచాయతీ రాజ్ అతిథి గృహంలో ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, పోలీస్ గౌరవ వందనం సమర్పించారు.
హైకోర్టు న్యాయమూర్తి, సిరిసిల్ల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్ తుకారాంజీ గారికి జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె శనివారం ఘన స్వాగతం పలికారు.
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో పుష్పగుచ్ఛాలు అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సిరిసిల్ల, వేములవాడ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి.లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి జి.మేఘన, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి చారి, తహసీల్దార్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.










