మండల కేంద్రంలో శ్రీ దుర్గమ్మ అమ్మవారికి కర్ర పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి మొట్టమొదటిసారిగా సర్పంచ్ నక్క రాజవ్వ, రాజయ్య రూ.10,016 చందాగా రాశారు.
మండల కేంద్రంలో శ్రీ దుర్గమ్మ అమ్మవారికి కర్ర పూజ కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి గ్రామస్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారికి మొట్టమొదటిసారిగా సర్పంచ్ నక్క రాజవ్వ, రాజయ్య రూ.10,016 చందాగా రాసి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క రాజవ్వ, రాజయ్య, ఉపసర్పంచ్ జంగా లావణ్య, శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నగునూరి నర్సాగౌడ్, వార్డ్ మెంబర్ బెజ్జారపు రాజు, పొన్నం రాహుల్, ఆకుల శేఖర్, అమ్మవారి విగ్రహ దాత మసర్థి జీవన్, సిరేల దాత బొడ్డు అశోక్ దంపతులు, తాడేపు లింగన్న, ప్రేమ్ పెద్దనవేణి వెంకటేష్ పాల్గొన్నారు. గ్రామస్తులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.












