కొండారెడ్డిపల్లిపోమాల్పల్లి పరిధిలోని కొండపై వెలసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం 7వసారి జరగడం విశేషం.
శివాలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, అనంతరం యజ్ఞ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో శివాలయ ధర్మకర్త కంచుకోట యాదగిరి, కుటుంబ సభ్యులు, కుమ్మరి వంశీకృష్ణ, కొండారెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ నరేష్, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ రావు, మనసాని రవీందర్, నలవోలు శ్రీనివాస్ రెడ్డి, నల్లవోలు రామకృష్ణ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ కుమ్మరి సత్యనారాయణ, హేమాజీపూర్ దామోదర్ రెడ్డి, యువ నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్, కొండేటి మాధవులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామానికి చెందిన పలువురు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ప్రతి మాస శివరాత్రికి ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఆలయ ధర్మకర్తలను, దేవాలయ కమిటీ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.












