జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, వారి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు.












