సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో సబ్ స్టేషన్ కు పెద్ద ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల చొరవతో ఈ చర్యలు చేపట్టారు. దీంతో మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారం కానుంది.
గత కొద్ది రోజుల నుండి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గ్రామంలో, మండలంలో రైతులకు, ప్రజలకు విద్యుత్ సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించారు. సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ను త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఈరోజు మంగళవారం ట్రాన్స్ఫార్మర్ రాకతో మండలంలో విద్యుత్ సమస్య పరిష్కారం కానుంది. ప్రజలకు, రైతులకు ఇకపై నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.












