నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు దంపతుల పెద్ద కుమార్తె యాతాకుల వేరోనిక ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ ఘనతతో ఆమె మండల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించడం ప్రతి విద్యార్థికి ఒక కల అని, తన కూతురు విజయం తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
వేరోనికా మాట్లాడుతూ, తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తాను ఈ సీటు సాధించానని తెలిపారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేశానని, భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఈ విజయం తనను మరింత ముందుకు నడిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు గార్ల కుమార్తె ఎంబీబీఎస్ సీటు సాధించడం మండలంలో నాయకులు, అధికారులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. వేరోనికా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వైద్య వృత్తిలో రాణించాలని ఆకాంక్షించారు. ఆమె విజయం అనేక మంది యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.












