నియోజకవర్గంలో వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతను ప్రోత్సహించే దిశగా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం () ఆధ్వర్యంలో రూ.9 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన డ్రోన్‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులు ఈ ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ముందుండాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. సహకార సంఘం ఆధ్వర్యంలో డ్రోన్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
డ్రోన్ ద్వారా పంటలకు పిచికారీ చేయడం వల్ల రైతులకు శారీరక శ్రమ తగ్గడంతో పాటు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రైతులు తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేలా ఆధ్వర్యంలో డ్రోన్ సేవలను అందించడం ఆనందదాయకమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ సబ్సిడీ అందిస్తోందని, రైతులు మరియు సహకార సంఘాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కు అనుభవం ఉన్న పాలకవర్గం ఉందని, రైతుల పక్షాన నిలిచి వారికి మరింత మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు.
వ్యవసాయ రంగానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. గతంలో జిల్లా కేంద్రంలో నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు వివిధ అంశాలపై చర్చించేవారని, కీలకమైన కార్యాలయాలకు కేంద్రంగా ఉండేదన్నారు. 1980 సంవత్సరానికి ముందే చల్లిగల్, పొలాస వ్యవసాయ క్షేత్రాలు, అగ్రోస్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. లస్కర్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులు లో నివాసం ఉండేందుకు క్వార్టర్స్ కూడా ఉండేవని గుర్తుచేశారు. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా లోని పలు కీలక కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితమైందని ఎమ్మెల్యే విమర్శించారు. దేశంలో కంప్యూటరీకరణ జరిగిన సహకార సంఘాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, దేశానికే తెలంగాణ సహకార సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ ఆధునీకరణ కోసం సహకార సంఘాలు మరింత చురుగ్గా పనిచేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, సీనియర్ నాయకులు బండ శంకర్, సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, పెండెం రాములు, నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, ఎన్ఆర్ఐ సెల్ చాంద్ పాషా, సర్పంచ్ కట్ట రాజేందర్, కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్, సేవాదళ్ సెక్రటరీ ముకేష్ ఖన్నా, మాజీ సర్పంచ్ అంకం సతీష్, మహేశ్వర్ రావు, గంగారాం, జయరాం సురేష్, ప్రవీణ్ రావు, సీఈఓ వేణు, పీఏసీఎస్ డైరెక్టర్లు పునుగోటి పురుషోత్తం రావు, నీరటి గంగారెడ్డి, జుంబర్తి శంకర్, నాగిరెడ్డి గంగారెడ్డి, అదరవేని రాజయ్య, మంచాల మల్లేశం, నట్టి వెంకటేశం, బల్లని సారయ్య, రేగుంట దుబ్బవ్వ, బొల్లె గంగయ్య, కేతి రెడ్డి సత్యనారాయణ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.












