జగిత్యాల, 10 November
జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారును రోడ్డుపైకి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







