జగిత్యాల, 11 November
మెట్పల్లి పట్టణ శివారులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో పది మంది గాయపడ్డారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి నుంచి బండాలింగాపూర్కు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, మార్గమధ్యలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలపై విచారణ చేపట్టారు.







