సిరిసిల్ల, 18 November
వైద్య రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటున్న రాజన్న జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, నియోనాటాలజిస్ట్, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ మరో అరుదైన ఘనతను సాధించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ () అందించే అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్‌కేర్ () కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రత్యేక కోర్సును పూర్తి చేయడం ఆయన వృత్తిపరమైన ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానం, భారతదేశంలో మొదటి స్థానం, ఆసియాలో రెండో స్థానం సాధించడం ఈ ఘనతకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.
కోర్సు లక్ష్యాలు
ఆరోగ్య రంగంలో నాయకత్వ లక్షణాలు, ఆసుపత్రుల నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, వ్యూహాత్మక నిర్ణయాలు, వైద్య సేవల నాణ్యత, ఆధునిక హెల్త్‌కేర్ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హెల్త్‌కేర్ నిపుణులు ఈ కోర్సులో భాగస్వాములయ్యారు.
ఈ నెల 14న మొహాలీలోని క్యాంపస్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ సాయికుమార్‌కు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందజేశారు.
ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
వైద్య వృత్తిలో నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని, వైద్య పరిజ్ఞానంతో పాటు ఆధునిక ఆసుపత్రి నిర్వహణ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన విధానాలను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని డాక్టర్ సాయికుమార్ పేర్కొన్నారు. ఈ కోర్సు ద్వారా పొందిన జ్ఞానాన్ని ప్రాంతంలో వైద్య సేవల అభివృద్ధికి ఉపయోగిస్తానని తెలిపారు.
స్థానికంగా వైద్య సేవలందిస్తూనే జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేయడం పట్ల పలువురు వైద్యులు, కుటుంబ సభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ సాయికుమార్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
స్థానిక వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిన డాక్టర్ సాయికుమార్ ఘనత కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.







