ఖమ్మం, 2026-11-24
ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
మృతులను హైదరాబాద్‌కు చెందిన కిషోర్‌రెడ్డి, లావణ్యగా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో వారి కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







