రాయికల్, 2026-08-27
జగిత్యాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి టీచర్ల నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. రాయికల్ మండలంలో మొత్తం 175 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 102 దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. మిగిలిన 73 మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జగిత్యాల ఐ సి డి ఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి టీచర్లకు దరఖాస్తు చేసుకున్న వారి నుండి ఆ యొక్క ధ్రువపత్రముల పరిశీలన కార్యక్రమము తేదీ 27.08.2026 నుండి దరఖాస్తు దారుల ఒరిజినల్ , జిరాక్స్ ధ్రువపత్రముల పరిశీలన కొనసాగుతున్నది. రాయికల్ మండలంలో 175 దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోగా, ఈ రోజు 03,09,2026 వరకు రాయికల్ మున్సిపాలిటీ లో 77 దరఖాస్తులకు 34 మరియు రాయికల్ మండలం రూరల్ లో 98 దరఖాస్తులకు 68 మాత్రమే ధృవపత్రంల పరిశీలన జరిగినది. మిగిలిన మున్సిపాలిటీ మరియు రూరల్ కలిపి 73 దరఖాస్తుదారుల ధ్రువపత్రంల పరిశీలన చేయించుకోవాలసి ఉన్నాయి. చివరి తేదీ కావున ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు పరిశీలించబడతాయి. సాయంత్రం 5 తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించబడవు. ఇది గమించగలరని ప్రాజెక్టు సి డీ పీ ఓ జయప్రద మేడం తెలియజేయడం జరిగింది.











