కథలాపూర్ (ధర్మ రథం) సెప్టెంబర్ 03
తెలంగాణలో 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 14 వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ, , , జేఏసీ నాయకులు జగిత్యాల జిల్లా మండల తాసిల్దార్ జి. రమేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
🔷 *DSP ధర్మ సమాజ్ పార్టీ & BC,SC,ST -JAC సంయుక్త ఆధ్వర్యంలో* ఈరోజు జగిత్యాల జిల్లా మండల తాసిల్దారు G. రమేష్ గారిని కలసి తెలంగాణలో 30 లక్షల మంది విద్యార్థులకి సంబంధించిన 14 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న కారణంగా,చెల్లింపు బకాయిలను, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో BC SC ST JAC నాయకులు తుపాకుల నర్సయ్య, జాప మల్లేశం పోడేటి రమేష్ .ధర్మ సమాజ పార్టీ నాయకులు దులూరి గంగరాజం, మల్లారపు వంశీ, లింగంపల్లి సురేష్ మొదలగు తదితరులు పాల్గొన్నారు.












