Jagtial/Jagtial (ధర్మ రథం) నవంబర్ 23
జగిత్యాల బైపాస్ రోడ్డులోని నాస్తిక్ ఎంటర్ప్రైజెస్ భవనం పై అంతస్తుల్లో అగ్నిప్రమాదం సంభవించింది.
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో, నారాయణ టెక్నో స్కూల్ సమీపంలో ఉన్న నాస్తిక్ ఎంటర్ప్రైజెస్ భవనం పై అంతస్తుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.
ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వంటి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.







