22 నవంబర్ 26 ధర్మ రథం (ధర్మ రథం) నవంబర్ 22
మాతృత్వం ఓ మధురానుభూతి.
మాతృత్వం ఓ మధురానుభూతి. అయితే, లాభార్జనే ధ్యేయంగా ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నప్పటికీ, అధిక లాభాల కోసం సిజేరియన్ ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. వైద్య అవసరాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న తీరుపై బీమా సంస్థ ప్లమ్ డేటా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఒకప్పుడు గర్భిణీ, కడుపులోని శిశువు ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ ప్రసవమా లేదా సిజేరియన్ చేయడమా అని వైద్యులు నిర్ధారించేవారు. కొన్ని పరిస్థితుల్లో గర్భిణీ కడుపులోని శిశువు తల కిందికి లేకపోవడం, ప్లాసెంటా లేదా బొడ్డుతాడుతో సమస్యలు, ఒక కాన్పులో మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనడం, తల్లుల్లో అధిక రక్తపోటు తదితర కారణాల వల్ల సిజేరియన్ చేసేవారు. కానీ నేడు కేవలం కాసుల కోసం తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ప్రైవేట్ ఆస్పత్రులు సి-సెక్షన్‌కు సిద్ధమవుతున్నాయి. బీమా సంస్థల నుంచి నగదు క్లెయిమ్ చేసుకుంటున్నా వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి.
అధ్యయన వివరాలు
కార్పొరేట్ ఉద్యోగులు, వైట్ కాలర్ ఉద్యోగుల ఆస్పత్రి ఖర్చుల క్లెయిమ్‌ల ఆధారంగా బీమా సంస్థ ప్లమ్ అధ్యయనంలో ప్రసవ సంరక్షణ విధానాలు, ఆస్పత్రుల ఎంపిక, సొంత ఖర్చుల శాతం వంటి అంశాలను పరిశీలించింది. ఇందులో కొన్ని ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న సిజేరియన్ల సంఖ్యపై చర్చ పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో 1,60,000కు పైగా ప్రసవ సంబంధిత ఆస్పత్రి బీమా క్లెయిమ్‌లపై వచ్చిన కొత్త డేటా ప్రకారం, ఇలాంటి జననాల సగటు రేటు 69 శాతంతో గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్లమ్ డేటా ల్యాబ్స్ కనుగొన్న గణాంకాలు అధికంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 2023-24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోని ధోరణులకు ఇవి అనుగుణంగానే ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం ప్రైవేట్ రంగంలో జరిగిన ప్రసవాలలో 54 శాతం సిజేరియన్లే. ఇందులో తెలంగాణ 62 శాతం, ఆంధ్రప్రదేశ్ 52 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. కోల్‌కతాలోనూ సి-సెక్షన్ల సంఖ్య 44 శాతం పైగా ఉంది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక సిజేరియన్లు
జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమైన 2005 నుంచి 2016 మధ్య జరిగిన ప్రసవాలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రసవం కోసం ఆస్పత్రిని ఎంచుకోవడం ఒక ముఖ్యమైన అంశమని, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థలలోనే ఎక్కువ సీ-సెక్షన్లు జరుగుతున్నాయని సూచించింది. ముఖ్యంగా నర్సింగ్ హోమ్‌లు, సింగిల్-స్పెషాలిటీ ప్రైవేట్ ఆస్పత్రులు, మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రులు, తల్లి-బిడ్డ స్పెషాలిటీ ఆస్పత్రులలో 6772 శాతం కేసులలో సీ-సెక్షన్ ప్రసవాలు జరిగాయని డేటా ల్యాబ్స్ అధ్యయనం వెల్లడించింది. మిషన్, ట్రస్ట్ ఆస్పత్రులలో 51 శాతంతో పోలిస్తే, మెట్రోయేతర నగరాల్లోని సింగిల్-స్పెషాలిటీ ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యధికంగా 7273 శాతం రేటు నమోదైంది.
వైద్య కారణాలు ఆర్థిక ప్రయోజనాలు







