జగిత్యాల, 2026-11-24
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకయ్యకుంట వద్ద బైక్‌ను ఒక లారీ ఢీకొట్టడంతో.. బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన భరత్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న వెంటనే, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను కేసీఆర్ తెలుసుకున్నారు.
మృతుడు కస్తూరి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.







