కొత్తపల్లి, 2026-11-25
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం బలపాలతిప్ప గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సోలార్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో గుడిసెలో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడు ధర్మకిరణ్ సజీవదహనమయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. కొత్తపల్లి మండలం బలపాలతిప్ప గ్రామంలో సోలార్ బ్యాటరీ పేలడంతో గుడిసెలో మంటలు చెలరేగి, ఐదేళ్ల బాలుడు ధర్మకిరణ్ సజీవదహనమయ్యాడు.
గిరిజన దంపతులు ఈరన్న, భారతమ్మల చిన్న కుమారుడు ధర్మకిరణ్ గుడిసెలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లి ఇంటి వెనుక బట్టలు ఉతుకుతున్న సమయంలో సోలార్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించింది.
క్షణాల్లో మంటలు గుడిసె మొత్తం వ్యాపించడంతో, తల్లి బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించినా మంటల తీవ్రత వల్ల లోపలికి వెళ్లలేకపోయింది. కళ్లెదుటే గుడిసెతో పాటు తన కుమారుడు అగ్నికి ఆహుతి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.







