ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాకిరాల గ్రామంలో ఓటు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు పగిళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా చాకిరాల గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వార్డు నెంబర్ ఫోరం అధ్యక్షుడు మిరియాల శ్రీనివాస్, చాకిరాల సర్పంచ్ మొగలగాని రమ్య నాగేంద్రబాబు, నోముల బుచ్చయ్య, చేకూరు శివ, హరీష్ చిర్ర, వినయ్ కుమార్, బత్తిని సతీష్, చిర్ర మహేష్, రామారావు, బాబీ, తీగల యల్లయ్య, మొగలగాని భార్గవ్ మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ, మండల కమిటీ నాయకులు, యువజన నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, గ్రామంలో అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఓటరు నమోదు ప్రక్రియ ఎంతో ముఖ్యమని వివరించారు. రత్నగరం, శ్రీరంగాపురం, మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో ఈరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.












