మునగాల, 2026-06-05
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు ఘనంగా ముత్యాలమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు ఘనంగా ముత్యాలమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే ఇంటి ముందు దొడ్డు ముత్యాలమ్మను పూజించి, అనంతరం ఏర్పాటు చేసిన బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య జనసందోహంతో ముత్యాలమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కలకోవ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండవ వెంకటాద్రి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.












