జగిత్యాల, 2026-06-05
రాయికల్ మండలంలోని కుమ్మరిపెల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమంలో భాగంగా సింగపూర్ దేశ పర్యటనకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 19 నుండి 26 వరకు జరిగే ఈ పర్యటనలో సింగపూర్ లోని ఉత్తమ బోధనా విధానాలను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

అభినందనలు
ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాధికారి రాము, రాయికల్ మండల విద్యాధికారి రాఘవులు, మండలంలోని ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. విదేశీ పర్యటనకు ఎంపికైన అభయ్ రాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు.