శాయంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో చేతిరాత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎస్జీటీ బొలిశెట్టి ప్రవీణ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సింగపూర్ విద్యా పర్యటన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు చేతిరాత పుస్తకాలు, విద్యా సామగ్రిని అందజేశారు.
శాయంపేట మండలంలోని ఎంపీపీ ఎస్ శాయంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో చక్కని చేతిరాత నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో అదే పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న బొలిశెట్టి ప్రవీణ విద్యార్థులకు సూచిరాత పుస్తకాలతో పాటు ఇతర విద్యా సామగ్రిని బహూకరించారు.
ఇటీవల సింగపూర్లో నిర్వహించిన విద్యా పర్యటనలో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన బొలిశెట్టి ప్రవీణ అక్కడి విద్యా విధానాలు, విద్యార్థుల ప్రతిభాపాటవాలు, చక్కని చేతిరాత నైపుణ్యాలను పరిశీలించారు. అక్కడ గమనించిన మంచి విద్యా పద్ధతుల స్ఫూర్తితో మన పాఠశాల విద్యార్థుల్లోనూ చేతిరాత నైపుణ్యాలను మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ మండల విద్యాశాఖ అధికారి గౌరవ శ్రీ జి. బిక్షపతి గారి చేతుల మీదుగా విద్యార్థులకు సూచిరాత పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని అందజేశారు. విద్యార్థులు ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా చక్కని చేతిరాతను అలవర్చుకోవాలని, చదువుతో పాటు ఇతర నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఈ సూచించారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న ఇటువంటి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్ల అశోక్ రెడ్డి, మేడిపల్లి సురేందర్, కే. ఉమా, పి. స్వప్న రాణి, ప్రత్యూష, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.












