మునగాల, 3 September
రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగనున్న కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని, సాయి గాయత్రి విద్యాలయంలో నేడే ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాఠశాలకు సెలవు దినం కావడంతో ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సాయి గాయత్రి విద్యాలయ లో ముందస్తుగా జరిగిన కృష్ణాష్టమి వేడుకలు. రేపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న కృష్ణాష్టమి వేడుకలను సాయి గాయత్రి విద్యాలయలో నేడు నిర్వహించారు రేపు పాఠశాలకు సెలవు దినం కావున ఈరోజే కృష్ణాష్టమి వేడుకలని ఘనంగా నిర్వహించారు.చిన్ని కృష్ణుడు మరియు గోపికల వేషధారణలో పిల్లలు కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ వేషధారణతో వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో వేడుకలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్పర్సన్ శ్రీమతి ఉషారాణి గారు ప్రిన్సిపాల్ శ్రీ శంకర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా వివిధ వేషధారణలతో పంపినందుకు వారికి పాఠశాల తరఫున ప్రిన్సిపల్ శ్రీ శంకర్ గారు ధన్యవాదాలు తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో విరివిగా జరుగుతూ ఉంటాయని అందరూ సహకరించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.












