మధిర, 16 September
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగవరప్పాడు విద్యార్థుల అవసరాలను గుర్తించి, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 సైకిళ్లను వితరణ చేశారు. విద్యార్థులు తమ అవసరాన్ని వీడియో ద్వారా తెలియజేయడంతో, మాజీ టీఏఎన్ఏ () అధ్యక్షులు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ జయశేఖర్ తాళ్లూరి కుమార్తె శ్రీ భావన స్పందించి ఈ సహాయం అందించారు.
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగవరప్పాడు విద్యార్థులకు తాళ్లూరి శ్రీ భావన వితరణతో 8 సైకిళ్లు అందజేశారు. ఒక నెల క్రితం పాఠశాల విద్యార్థులు తమకు సైకిల్స్ అవసరాన్ని ఒక అభ్యర్థన వీడియో ద్వారా తెలియజేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న మాజీ టీఏఎన్ఏ () అధ్యక్షులు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ జయశేఖర్ తాళ్లూరి తమ కుమార్తె శ్రీ భావన స్పందించి, డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా వాటిని పాఠశాలకు పంపించారు.
ఈరోజు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పురం సంగారావు అధ్యక్షతన ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ చెరుపల్లి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల కోసం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
నాగవరప్పాడు నుంచి మర్లపాడు ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం 8 సైకిళ్లను వితరణ చేసిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు శ్రీ తాళ్లూరి జయశేఖర్ గారి కుమార్తె శ్రీమతి తాళ్లూరి శ్రీ భావన గారికి పాఠశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
విద్యార్థుల అవసరాన్ని గుర్తించి, వారి చదువుకు తోడ్పడేలా అందించిన ఈ సహాయం పేద విద్యార్థుల కోసం మేమున్నాం అనే మానవతా స్ఫూర్తికి నిదర్శనం. ఈ సైకిళ్లు విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, వారి విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ చెరుపల్లి శ్రీహరి, జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ బయ్యన బాబురావు, జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సభ్యులు శ్రీ తాళ్లూరి జయశేఖర్, సమన్వయకర్త శ్రీ బండి నాగేశ్వరరావు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి ముచ్చునాగమణి, ఉప సర్పంచ్ తోక వీరస్వామి, ఉపాధ్యాయులు సిహెచ్ వి రవికుమార్, డి లింగయ్య, అంగన్వాడి టీచర్ ఏ కృష్ణవేణి, సత్యవతి ఎం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.












