మధిర, 16 September
పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖాజీపురం నుండి ఆదుకోరు రింగ్ రోడ్డు వరకు జరిగిన ఈ నిరసనలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఖాజీపురం నుండి ఆదుకోరు రింగ్ రోడ్డు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, అనిల్, తేజ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి చేతులు దులుపుకునే కుట్ర చేస్తోందని అన్నారు. శక్తి పథకం పేరుతో పాలిటెక్నిక్ విద్యను కలిపి, ప్రైవేట్ కంపెనీలకు కావాల్సిన కార్మికులను తయారు చేసేలా పథకాన్ని మార్చి, విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రమైన ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ఎన్నో ఆశలతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఉన్నత చదువులు చదవాలని భావిస్తున్న విద్యార్థుల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారంతో కాలరాయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ఆందోళనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరారు. జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకునేంత వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.












