దెందుకూరు ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషులో చక్కని చేతిరాత నేర్పించడానికి ఖమ్మం నుండి కాలిగ్రఫీ మాస్టర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా, సుమారు పదివేల రూపాయల విలువైన డబుల్ రూల్, ఫోర్ రూల్ ఇంగ్లీషు హ్యాండ్ రైటింగ్ నోట్ బుక్స్ ను విద్యార్థులకు అందజేశారు.
దెందుకూరు ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీషులో చక్కని చేతిరాత నేర్పించడానికి ఖమ్మం నుండి ఇంగ్లీషు చేతిరాత కాలిగ్రఫీ నేర్పించే మాస్టర్‌ను ఆహ్వానించారు. ఈ చేతిరాత నేర్పించడానికి కావలసిన డబుల్ రూల్ మరియు ఫోర్ రూల్ ఇంగ్లీషు హ్యాండ్ రైటింగ్ నోట్ బుక్స్ ను 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు అందజేశారు. దాదాపు పదివేల రూపాయల విలువ చేసే ఈ నోట్ బుక్స్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాజకుమారి గారి శిష్యుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరవింద్ గారు అందజేశారు. ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రాజకుమారి గారు ఎర్రుపాలెం హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆమెకు శిష్యుడిగా ఉండేవారు. మేడమ్ గారి కోరిక మేరకు ఈ నోట్ బుక్స్ ను అందజేసినట్లు తెలిపారు. దెందుకూరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ దాదాపు పదివేల రూపాయల విలువ చేసే చేతిరాత నోట్ బుక్స్ ను అందజేసినందుకు గాను పాఠశాల తరఫున అరవింద్ గారికి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రాజకుమారి గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












