తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల తేదీలను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. ఎస్ఐ పోస్టులకు న, కానిస్టేబుల్ పోస్టులకు న పరీక్షలు నిర్వహించనున్నట్లు మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థులకు ఉపశమనం కలిగింది.
రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఎస్ఐ స్థాయి పోస్టులకు న, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు న రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది జులై 29న హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో దాదాపు 7,437 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా లేదా అనే అనుమానంలో ఉన్న అభ్యర్థులకు ఈ వార్త కొంత ఉపశమనాన్ని కలిగించింది.
పోలీస్ శాఖ విడుదల చేసిన 7,437 పోస్టుల్లో దాదాపు 4,800 కానిస్టేబుల్ పోస్టులు, 200 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 44 ఎస్ఐ, 1,380 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 39 ఎస్సై, 751 కానిస్టేబుల్ పోస్టులు, జైళ్ల శాఖలో 15 ఎస్ఐ, 208 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ వరకు కొనసాగింది. ఈ 28 రోజుల వ్యవధిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 4.29 లక్షల మంది నుంచి 5.77 లక్షల దరఖాస్తులు అందాయని చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. సగటున ఒక్కో అభ్యర్థి 1.34 దరఖాస్తులు చేసినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు, 28.88 శాతం మంది రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.












