తెలుగు భాష, సాహిత్యంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు నిర్వహించిన తెలుగు పద్య పోటీల్లో కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో నిర్వహించిన పద్య పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి 6వ తరగతి విద్యార్థి వరుణ్, 7వ తరగతి విద్యార్థిని దీవెన, 8వ తరగతి విద్యార్థిని మేఘన తెలుగు పద్య పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. వీరు జిల్లా స్థాయికి ఎంపిక కావడం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
తెలుగు ఉపాధ్యాయురాలు సుశీల ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులను పద్య పోటీలకు సిద్ధం చేశారు. తెలుగు భాష అంతరించిపోకుండా భావితరాలకు అందించడంలో భాగంగా విద్యార్థులకు పద్యాలను కంఠస్థం చేయిస్తూ, వాటి భావాన్ని అర్థం చేసుకునేలా శిక్షణ అందించినట్లు తెలిపారు.
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.












