చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అనారోగ్యానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని, స్పృహతప్పి పడిపోయారని వార్తలు వస్తున్నాయి. చైనా డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్, అసమ్మతి నేత వాంజున్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌తో ఈ ప్రచారం మొదలైంది.

వివరాల్లోకి వెళితే.. వాంజున్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో జిన్‌పింగ్ అనారోగ్యంపై సంచలన ఆరోపణలు చేశారు. బ్రిక్స్ సదస్సులో ఆయనకు స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని పోస్ట్ చేశారు. స్పృహ కోల్పోయిన జిన్‌పింగ్‌ను ప్రత్యేక విమానంలో చైనాకు తరలించారని పేర్కొన్నారు. విమానాశ్రయంలో దిగిన జిన్‌పింగ్‌ను స్వాగతించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, వెంటనే సైనిక హెలికాప్టర్లో మిలిటరీ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదని, అమెరికా పర్యటనకు ముందు ఆయన కోలుకునే అవకాశాలపై సమాచారం లేదని తెలిపారు. ఆసుపత్రి వద్ద మార్షల్ లా అమల్లో ఉందని తెలిపారు. భారత్‌లో చికిత్స పొందితే ఆయన ఆరోగ్య సమాచారం బయటకు వస్తుందనే భయంతో, ప్రాథమిక వైద్య సహాయం పొందిన వెంటనే అక్కడి నుంచి బయల్దేరినట్లు తెలిపారు.