రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పెనుగొండ గాయత్రి, సాంబార్ మణికంఠలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్యలో రాణించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వాసం ప్రసాద్ అన్నారు.
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పెనుగొండ గాయత్రి, సాంబార్ మణికంఠలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వాసం ప్రసాద్ మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్యలో రాణించడం అభినందనీయమన్నారు. ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించడం వారి పట్టుదల, కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, మురళి గౌడ్, బత్తిని భూమయ్య, మ్యాకల రమేష్, మచ్చ శేఖర్, ఆడెపు రాంప్రసాద్, సామల సత్యనారాయణ, వాసం స్వామి, కౌన్సిలర్ పల్లికొండ గంగాధర్, సంకోజి అశోక్, పులి రమేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. తమను ఘనంగా సన్మానించిన లయన్స్ క్లబ్ సభ్యులకు విద్యార్థులు గాయత్రి, మణికంఠ కృతజ్ఞతలు తెలిపారు.












