జగిత్యాల జిల్లా మండలంలోని జగన్నాథ్ పూర్ గ్రామంలో ఉన్న గిరిజన గురుకుల వసతి గృహాన్ని సబ్ కలెక్టర్ కన్నం హరిణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జగిత్యాల జిల్లా మండలంలోని జగన్నాథ్ పూర్ గ్రామంలో ఉన్న గిరిజన గురుకుల వసతి గృహాన్ని జగిత్యాల సబ్ కలెక్టర్ కన్నం హరిణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వసతి గృహంలో, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు సృజనాత్మక విద్యతో పాటు, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే వివిధ రకాల కార్యక్రమాలను వివరిస్తూ, విద్యా బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగార్జున, గిరిదావర్ పద్మయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












