ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, వారికి శాస్త్రీయ సూచనలు, సలహాలు అందించి, పంటలు ఎండిపోకుండా విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల జిల్లాలో వ్యవసాయ శాఖ, ఆత్మ () అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కిసాన్ మేళా2026ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు అందించాల్సిన సహాయ సహకారాలపై వివరించారు.
కిసాన్ మేళా ద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య, వెంకట్ రెడ్డి, సర్పంచ్ శంకర్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, హకీమ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.












