Suryapet/Munagala (ధర్మ రథం) సెప్టెంబర్ 05
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం అర్థశాస్త్ర విభాగ అధ్యాపకుడు డాక్టర్ సోమపంగు రమేష్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. కొడంగల్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
*రేపాల గ్రామ అధ్యాపకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు* ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న అర్థశాస్త్ర విభాగ అధ్యాపకుడు డాక్టర్ సోమపంగు రమేష్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి అయిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ లో ఈరోజు ఈ అవార్డును తీసుకున్నారు ఎంపికైన వారికి ప్రశంసా పత్రం, శాలువా మరియు పదివేల రూపాయల నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో ఈ అవార్డు ఎంపికకు అనేక ప్రమాణాలు పాటిస్తారని ఉదాహరణకు విద్యార్థులు ఉత్తీర్ణత శాతం, డిగ్రీ అనంతరం వారి విద్యా మరియు ఉద్యోగ అవకాశాలు, వారు సాధించిన విజయాలు, అవార్డు గ్రహీత రచించిన గ్రంథాలు, జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సుల్లో పత్రికల్లో ప్రచురింపబడిన వ్యాసాలు, పెటెంట్లు కళాశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్, కళాశాల అభివృద్ధిలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్ పర్యావరణ పరిరక్షణ, చెట్లను నాటించడం మరియు ఇతర బాధ్యతలు ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అవార్డు సాధించిన డాక్టర్ రమేష్ ను రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ అభినందించారు. అలాగే మాది ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు అభినందించారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రమేష్ మాట్లాడుతూ చిన్నతనం నుండి పేదరికంతో అనేక కష్టనష్టాలు ఎదుర్కొని తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారని తెలియజేశారు. విద్యతోనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలుసుకొని విద్యాభివృద్ధిలో అనేక మైలురాళ్లను అధిగమించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని డాక్టర్ సోమపంగు రమేష్ తెలియజేశారు.












