Jagithyal, 5 September
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో () జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం* *విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్* జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యాశాఖ, జగిత్యాల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవం శనివారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (IDOC)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ* , సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత గొప్పదని అన్నారు. విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, మంచి ఆలోచనా విధానం, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమని, ఈ పురస్కారాలు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు *అదనపు కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ,* విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, సామాజిక స్పృహ వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి పురస్కారాలతో సత్కరించడం ద్వారా వారిలో మరింత స్ఫూర్తి, బాధ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు ఇతరులకు ఆదర్శంగా నిలిచి, విద్యార్థుల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, డిప్యూటీ CEO నరేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, సంబంధిత అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.












