ఆధ్వర్యంలో (ధర్మ రథం) సెప్టెంబర్ 05
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన గాజేంగి రాజేశం, బెజ్జంకి హరికృష్ణలను ఘనంగా సన్మానించారు.
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది ...గురు దేవో భవ ....! దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్ అన్నారు.శనివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు గాజేంగి రాజేశం, బెజ్జంకి హరికృష్ణ లను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,కోశాధికారి సుధవేణి మురళి,చార్టర్డ్ ప్రెసిడెంట్ మోర హన్మాండ్లు,క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రామ్ ప్రసాద్,పారి పెళ్లి శివ ప్రసాద్,పులి రమేష్,సత్యనారాయణ,గ్రామీణ వైద్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












